భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోని పట్టణంలోని ప్రసూతి ఆసుపత్రి పక్కన ఉన్న అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్ పరిశుభ్రత, భోజన నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆమె, అక్కడికి వచ్చిన ప్రజలకు స్వయంగా భోజనం వడ్డించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అధికారులతో కలిసి సేవా నిర్వహణలో లోపాలేమైనా ఉన్నాయా అని సమీక్షించి, అవసరమైన సూచనలు చేశారు.
ఆదోనిలో అన్న క్యాంటీన్‌పై కలెక్టర్ డా. ఏ. సిరి ఆకస్మిక తనిఖీ





