భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కర్నూలు నగరం ఏ క్యాంప్‌లోని ఇందిరాగాంధీ స్మారక మున్సిపల్ హైస్కూల్‌ను జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి శనివారం సందర్శించారు. ఈ పాఠశాలను మెంటార్ స్కూల్‌గా ఎంపిక చేసుకున్న ఆమె, వంద రోజుల ప్రణాళికలో భాగంగా పదో తరగతి విద్యార్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యలో క్రమశిక్షణ, లక్ష్య సాధన ఎంతో ముఖ్యమని పేర్కొంటూ చదువుపై పూర్తిగా దృష్టి సారించాలని సూచించారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ.. పిల్లల చదువులో ప్రోత్సాహం, పర్యవేక్షణ అవసరమని తెలిపారు. ఉపాధ్యాయులు సమన్వయంతో పని చేసి…
మున్సిపల్ హైస్కూల్‌ను సందర్శించిన కలెక్టర్ సిరి





