భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో మరణించిన 13 మంది పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు వెంటనే అమలు చేయాలని నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ డివిజన్ అధ్యక్షులు సుమాల చార్లెస్ డిమాండ్ చేశారు. సీపీఐ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో 12 రోజులుగా జరుగుతున్న నిరాహార దీక్షలకు సంఘీభావంగా పాల్గొన్న ఆయన, కారుణ్య నియామకాలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆ కుటుంబాలకు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు మంజూరు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి యేసురాజు,…