భారత్ సమాచార్, నారాయణపేట జిల్లా: కాంగ్రెస్ పార్టీ నాయకులపై బీఆర్ఎస్ మాజీ ఏమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మక్తల్ నియోజకవర్గంలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మక్తల్ నియోజకవర్గంలో సకాలంలో రైతులకు యూరియా అందించడం లేదని, హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో యూరియా కొరత రాకుండా చూశామని, దేశానికి వెన్నెముక్కలాంటి రైతులను ఆదుకున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఆయన పేర్కొన్నారు. వచ్చే స్థానికల ఎన్నికల్లో బీఆర్ఎస్…