భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి, ప్రజానేత కాసం లక్ష్మారెడ్డి ఆకస్మిక మృతి బాధాకరమని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. నెల్లికుదురు మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి పార్టీకి, కుటుంబ సభ్యులకు తీరని లోటని పేర్కొన్నారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన నాయకుడిని కోల్పోవడం బాధాకరమని వేం నరేందర్ రెడ్డి అన్నారు.

ఆదివారం రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్,…