భారత్ సమాచార్.నెట్, కర్నూలు: ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ హాజరయ్యారు. రాజ్యాంగ ప్రధాన శిల్పి డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం అందించే ప్రజాస్వామ్య హక్కులు, బాధ్యతలను అధికారులకు వివరించారు. అనంతరం అందరితో కలిసి భారత రాజ్యాంగ పీఠికను చదివించి ప్రతిజ్ఞ చేయించారు.

రాజ్యాంగం దేశ ప్రజలకు సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి విలువలను అందించిందని, ప్రతి ప్రభుత్వ…