భారత్ సమాచార్.నెట్, ప్రకాశం: కనిగిరి మండలం గురవాజిపేట 1వ అంగనవాడీ కేంద్రంలో బుధవారం ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఎం.వి.ఎస్. పార్వతి అధ్యక్షతన సెక్టార్ సమావేశం జరిగింది. మొదట, ‘భారత రాజ్యాంగ దినోత్సవం’ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్వతి మాట్లాడుతూ.. రాజ్యాంగ లక్ష్యాలు, హక్కులు, కర్తవ్యాలను వివరిస్తూ, ప్రతి పౌరుడు ఆ విలువలను ఆచరించాలని ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం కార్యకర్తలకు ప్రధానమంత్రి మాతృ వందన యోజన, ఆయుష్మాన్ భారత్ హెల్త్ డిజిటల్ అకౌంట్ నమోదును పూర్తి చేయాలని సూచించారు.…



