భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగాలని, విద్యుత్ సరఫరాకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మెదక్ మండలంలో పాతూరు సబ్ స్టేషన్ ను కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. ఈ సందర్బంగా అక్కడి విద్యుత్ శాఖ సిబ్బందిని కలిసి విద్యుత్ సరఫరా తీరును అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరంగా విద్యుత్ సరఫరా కొనసాగించాలంటూ అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని కథనాలు: