భారత్ సమాచార్, ఆంధ్రప్రదేశ్: ఆస్ట్రేలియా (బ్రిస్బేన్) జేమ్స్ కుక్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ సస్టయినబుల్ ట్రోఫికల్ ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ విభాగం ప్రొఫెసర్ క్యాల్ జెంజర్ తో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఉష్ణమండల ఆక్వాసాగులో కీలకమైన బ్లాక్ టైగర్, బారాముండి రకాల రొయ్యల జన్యుపరమైన మెరుగుదల పరిశోధనలకు ప్రొఫెసర్ జెంజర్ నాయకత్వం వహించారు. ఆక్వాసాగు సామర్థ్యాన్ని పెంచే జన్యుసంబంధ సాధనాల అభివృద్ధికి కృషిచేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో రొయ్యలు, చేపల పెంపకం…