భారత్ సమాచార్.నెట్, మెదక్: మెదక్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు సమన్వయంతో, ప్రజల పట్ల బాధ్యతగా పనిచేయాలని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమక్షంలో వైద్యారోగ్య, విద్య, వ్యవసాయ, మున్సిపాలిటీ సహా పలు శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పెండింగ్ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రత్యేకించి ధాన్యం కొనుగోలును వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. కొత్త బ్రిడ్జి పనులు,…





