భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట మండలం మర్రిగూడెం గ్రామ సర్పంచ్ ఎన్నికలలో సీపీఐ అభ్యర్థి స్వప్న జగన్‌కు మద్దతుగా జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం, గ్రామ అభివృద్ధి లక్ష్యంగా స్వప్న జగన్‌ను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన అభ్యర్థి స్వప్న జగన్, గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాల కోసం, గ్రామ అభివృద్ధి కోసం ఏకైక లక్ష్యంగా కృషి చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు.…