భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: సీపీఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఎమ్మిగనూరులోని సీపీఐ కార్యాలయం ముందు సీనియర్ నాయకులు కామ్రేడ్ బీటీ. చిన్నాన్న సీపీఐ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పట్టణ కార్యదర్శి జి.రంగన్న అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వర్గ దోపిడీ ఉన్నంతకాలం కమ్యూనిస్టు ఉద్యమం కొనసాగుతుందన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటం నుంచి కార్మిక, రైతు, పేదల హక్కుల కోసం సీపీఐ చేసిన పోరాటాలు భారత చరిత్రలో విడదీయరానివని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, లౌకికత,…