భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తూప్రాన్ మండలం వెంకటాపురం (పి.టి) గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లలితా పరమేశ్వరీ దేవీ ఆలయం ప్రాంగణంలో గురువారం శ్రీ దత్తాత్రేయ స్వామి వారి జయంతి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు, దేవి ఉపాసకుడు బ్రహ్మశ్రీ సోమయాజుల రవీంద్ర శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఉదయం 10 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు, అర్చనలు వైదిక మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి దత్త భిక్ష కార్యక్రమం జరిగింది.…





