భారత్ సమాచార్, మెదక్ జిల్లా: శివంపేట్ మండలం గూడూరు గ్రామంలోని దత్తాత్రేయ ఆలయంలో మరోసారి చోరీ జరిగింది. గత చోరీ ఘటన జరిగి 12 రోజులు కూడా పూర్తికాకముందే దుండగులు అదే ఆలయాన్ని మరోసారి లక్ష్యంగా చేసుకున్నారు. ఆలయంలోని హుండీని పగలగొట్టి అందులో ఉన్న నగదును అపహరించినట్లు తెలుస్తోంది. వరుసగా రెండుసార్లు చోరీ జరగడంతో గ్రామస్థులు, భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

గతంలో ఆలయంలో చోరీ జరిగినప్పటికీ తాజాగా మరోసారి హుండీ పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆలయానికి భద్రతా చర్యలు…