భారత్ సమాచార్, కర్నూలు జిల్లా : దేవనకొండకు చెందిన డీలర్ లక్ష్మన్న(52) ఆదివారం గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా సదా చురుకుగా ఉండే ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచారు. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్సకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. లక్ష్మన్న మరణ వార్త తెలియగానే బంధుమిత్రులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయనను సన్నిహితులు, సహచరులు మంచి మనసున్న వ్యక్తిగా గుర్తుచేసుకుంటున్నారు. గ్రామంలో అందరితో సఖ్యతగా మెలిగిన లక్ష్మన్న అకాల మరణం తీరని లోటుగా మారిందని పలువురు…
డీలర్ లక్ష్మన్న ఆకస్మిక మృతి





