భారత్ సమాచార్, మెదక్ జిల్లా: శంకరంపేట ఆర్ మండలంలోని మిర్జాపల్లి గ్రామ చెరువులో, గజ గట్లపల్లిలో శుక్రవారం ఉచిత చేప పిల్లల పంపిణీ చేశారు. మత్స్యకారుల సంక్షేమంలో భాగంగా వారికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి 100% రాయితీ తో చేపపిల్లల పంపిణీ చేస్తుందన్నారు. మత్స్య కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాష్ట్రంలో మత్స్య సంపద పెంచాలని తద్వారా మత్స్య…