భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: బీఆర్ఎస్ పార్టీతోనే గ్రామాలు అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అన్నారు. గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని సోమవారం గ్రామ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 50 మంది యువకులు పార్టీలో చేరారు. గోవర్ధన్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత పది…