భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: పినపాక మండలం పొట్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. పొట్లపల్లి అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం పొట్లపల్లి మెయిన్ సెంటర్‌లో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు పక్కలను శుభ్రపరుస్తూ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టారు. అలాగే గడ్డిగూడెం గ్రామంలో చెడిపోయిన మంచినీటి బోరును మరమ్మతులు చేసి మళ్లీ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ మద్దెల సమ్మయ్య, ఉపసర్పంచ్ కోరిపెల్లి రవీందర్, తాళ్ల గుట్టయ్య, బడే కృష్ణ,…