భారత్ సమాచార్.నెట్, మెదక్: వెల్దుర్తి మండలం చెర్లపల్లి గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు దసరా పండుగ సందర్భంగా ఘనంగా ముగిశాయి. గురువారం హనుమాన్ దేవాలయం వద్ద భక్తులు భక్తి గీతాలు, భజన కీర్తనలతో కోలాటం ఆడారు. దుర్గామాత దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా భక్తి గీతాలు, భజన కీర్తనలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. ఉత్సవాలకు ముగింపుగా, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రావణ…