భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడం, ఉన్నవాటిని వినియోగించలేని దుస్థితి నెలకొనడంపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన పర్యవేక్షణ, నిర్వహణ లేకపోవడంతో వివిధ పనుల కోసం వచ్చే వృద్ధులు, వికలాంగులు అవస్థలు తప్పడం లేదు. ముఖ్యంగా తహశీల్దార్, ఆప్కారీ సర్కిల్ కార్యాలయాలు ఎత్తైన గుట్టపై ఉన్న నీటిపారుదల శాఖ అతిథి గృహంలోకి మార్చారు. ఇక్కడికి రాకపోకలు వృద్ధులకు కష్టంగా మారింది. జూనియర్ సివిల్ కోర్టు భవనం కూలిపోవడంతో ఇతర కార్యాలయాలు ఒకదాని తర్వాత మరొకటి…