భారత్ సమాచార్.నెట్, కర్నూలు : జిల్లాలో నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిరంతరం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న షరీన్ నగర్‌కు చెందిన వడ్డే తులసి కుమార్‌ను జిల్లా నుండి బహిష్కరిస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఉత్తర్వులు జారీ చేశారు. అతనిపై కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్‌తో పాటు హత్యాయత్నం, దోపిడీ, ఎస్సీ–ఎస్టీలపై దాడుల వంటి ఐదు తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి.

 

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం…