భార‌త్ స‌మాచార్.నెట్‌, వనపర్తి: జిల్లా కేంద్రంలోని ఐడీవోసీ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుక‌ల‌ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌స‌గించారు. ఏ ఉద్యోగి అయినా సంతృప్తి తాత్కాలికమే కానీ, ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని ఆయన అభివర్ణించారు. జనాభా సర్వేలు, ఎన్నికల వంటి ప్రజాస్వామ్య ప్రక్రియల్లో ఉపాధ్యాయులు పనిచేస్తేనే నమ్మకం ఉంటుందని అన్నారు.

రాష్ట్రంలో రెండు జిల్లాలు విద్యాపరంగా ఉత్తమంగా గుర్తింపు పొందగా, అందులో వనపర్తి జిల్లా లేకపోవడం బాధాకరమని కలెక్టర్ పేర్కొన్నారు.…