భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా, నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం తర్వాత అర్జీల పరిష్కార పురోగతిపై ఆమె సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేసి, ఐవీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్ సానుకూలంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు, ప్రభుత్వ పథకాల అమలుకు ప్రాధాన్యం ఇచ్చి ప్రజల ఆదాయాన్ని పెంచేందుకు కృషి…