భారత్ సమాచార్, కాకినాడ జిల్లా: తుని ప్రభుత్వ ఆసుపత్రిలో రత్నకుమారి అనే మహిళా.. శనివారం ఉదయం కవల పిల్లలకు జన్మనిచ్చి మరణించింది. డెలివరీ తర్వాత ఆమెకు ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్నా, వైద్యులు పట్టించుకోలేదని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో ఆమెను కాకినాడకు తీసుకెళ్తుండగా కోమాలోకి వెళ్ళింది. దీంతో తిరిగి తుని ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే అక్కడ డాక్టర్లు చనిపోయిన ఆమెకు చికిత్స చేస్తున్నట్టుగా నటించారని బంధువులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని కథనాలు: 

ఏసీబీ వలలో చిక్కిన కాకినాడ జనరల్ మేనేజర్