భారత్ సమాచార్, యాదాద్రిభువనగిరి జిల్లా: మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ఆరెగూడెం రోడ్డులో ఏర్పాటుచేసిన శ్రీ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దాత పల్లెర్ల కళ్యాణి వెంకన్న గుప్త ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు గణనాథుడికి భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు చేశారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో మోత్కూర్ పట్టణ, మున్సిపాలిటీ ప్రజలు సుభిక్షంగా ఉండాలని వారు కోరారు.