భారత్ సమాచార్.నెట్, కర్నూలు: ఆదోని ఇంఛార్జ్ సబ్ కలెక్టర్ టి. అజయ్ కుమార్, ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (PGRS)పై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పి.జి.ఆర్.ఎస్.లో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా, నాణ్యతగా, గడువులోపు పరిష్కరించాలని ఆయన సూచించారు.

స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డివిజన్‌లోని వివిధ మండలాల ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. సమస్యలను పరిష్కరించడంలో జాప్యం జరగకుండా, ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్.ఎల్.ఎ.లోకి వెళ్లకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.…