భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాలని జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి అధికారులను ఆదేశించారు. మంత్రాలయం మండలంలో పర్యటించిన కలెక్టర్ పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలపై ప్రజలతో మాట్లాడారు. హౌసింగ్ లేఅవుట్లలో తాగునీరు, రోడ్లు, స్ట్రీట్ లైట్స్ సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. హౌసింగ్ పథకంపై ప్రజల నుంచి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ రావాలని కలెక్టర్ తెలిపారు.