భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: మంత్రాలయం మండలం మాధవరం చెక్‌పోస్ట్ సమీపంలో ఎస్సై విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై విజయ్ కుమార్ మాట్లాడుతూ.. కర్ణాటకకు అక్రమంగా మద్యం తరలించినా లేదా మద్యం సేవించి వాహనాలు నడిపినా రూ.10 వేల జరిమానా లేదా జైలు శిక్ష విధించబడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.