భారత్ సమాచార్, మెదక్ జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రజలు, అధికారులు, పోలీస్ శాఖకు తప్పకుండా సహకరించాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ కోరారు. శుక్రవారం ఆయన నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి, ఎస్సై మురళితో కలిసి కౌడిపల్లి, తునికి మూట్రాజ్‌పల్లి, వెంకట్రావుపేట్, తిమ్మాపూర్, వెల్మకన్న గ్రామాల్లోని పోలింగ్ బూత్‌ల ఏర్పాటును పరిశీలించారు. తూప్రాన్ సబ్‌డివిజన్ పరిధిలో గుర్తించిన సమస్యాత్మక గ్రామాల్లో పగడ్బందీ చర్యలు చేపట్టామని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా ఓటు వేసే వాతావరణాన్ని కల్పిస్తున్నామని…
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ





