భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (డి.ఎస్.ఎఫ్) ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలోని మెట్రో ఫంక్షన్ హాల్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి డి.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, కార్యదర్శి బాలు, ఆలూరు ఇన్‌చార్జ్ భరత్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. పీపీపీ విధానాన్ని రద్దు చేసి వైద్య కళాశాలలను పూర్తిగా ప్రభుత్వమే నిర్వహించాలని, పెండింగ్‌లో…