భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూర్ మండలం ముషిపట్ల గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఎల్‌నినో వాతావరణ పరిస్థితులు, వాటి ప్రభావం మరియు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు సాగు విధానాలను మార్చుకుని పంట నష్టాలను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్యవసాయ నిపుణుల సూచనలను ఆసక్తిగా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి వి. కీర్తి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం కారణంగా…