భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గ్రామ పంచాయతీ ఎన్నికలు–2025 నేపథ్యంలో ఎన్నికల వ్యయ, మద్యం నియంత్రణ చేయాలని ఎలక్షన్ సాధారణ అబ్జర్వర్ భారతి లక్పతి నాయక్ అన్నారు. సోమవారం మంబోజి పల్లి చెక్‌పోస్టులను సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన తనిఖీ వ్యవస్థలు, వాహనాల పరిశీలన, నగదు-వస్తువుల కదలికలపై అమలు చేస్తున్న నియంత్రణ చర్యలను వివరంగా పరిశీలించారు. చెక్‌పోస్టుల్లో అప్రమత్తత, సమన్వయం, సమాచార వినిమయం అంశాలపై పలు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో రమాదేవి, తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
చెక్ పోస్టులను సందర్శించిన ఎలక్షన్ అబ్జర్వర్





