భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: మంత్రాలయం మండలం సుంకేశ్వరిలో విద్యుత్ శాఖ అధికారి గోవిందు ఆధ్వర్యంలో ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. స్మార్ట్ మీటర్ల ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. పాత విద్యుత్ స్తంభాలను కొత్తవిగా మార్చి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు వినియోగదారుల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజల సమస్యలపై కృషి కొనసాగుతున్నట్లు, భవిష్యత్తులో మెరుగైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
సుంకేశ్వరిలో కరెంటోళ్ల జనబాట నిర్వహణ





