భారత్ సమాచార్.నెట్, కర్నూలు : వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS) ఆధ్వర్యంలో ఈ నెల 13న ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నిర్వహించనున్న వికలాంగుల మహాసభను విజయవంతం చేయాలని ఎంఆర్‌పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మహాసభకు మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఆదోనిలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో ఎంఆర్‌పీఎస్ – ఎంఎస్‌పీ కీలక నాయకులు సమావేశమయ్యారు.

 

ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా ఇన్‌ఛార్జి పులిగుంట్ల గోపి, ఎమ్‌ఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అనంతరం మందకృష్ణ మాదిగ తొలిసారిగా…