భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోని జిల్లాకు వ్యతిరేకం కాదని, ఆదోనిని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తూ ఎమ్మిగనూరును జిల్లా కేంద్రంగా ప్రకటించాలని పెద్దమర్రివీడు మాదిగ నాగరాజు డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరు జిల్లాగా మారితే ఉపాధి అవకాశాలు పెరిగి వలసలు తగ్గుతాయని, ప్రభుత్వ భూములు, విద్యా సంస్థలు, తాగునీరు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. చేనేత పరిశ్రమలు అభివృద్ధి చెంది వస్త్ర బ్రాండ్‌గా ఎదుగుతాయని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎమ్మిగనూరును జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.