భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కార్మిక చట్టాల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను కార్మిక వర్గం పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టీయూ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన కార్మిక సంఘాల సమావేశానికి ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి విజేంద్ర అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు వీరేష్, తిమ్మాగురుడు,…