భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: మంత్రాలయంలో ఇళ్లను ప్రైవేట్ వసతి గృహాలు, హోమ్‌స్టేలుగా నిర్మించే ప్రతి యజమాని తప్పనిసరిగా సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాలని కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సోమవారం హెచ్చరించారు. అనుమతులు లేకుండా భవనాలు నిర్మించడం చట్టవిరుద్ధమని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు భవన యజమానులకు నిబంధనలపై అవగాహన కల్పించారు. ఇంటి నిర్మాణం పేరుతో పంచాయతీ అనుమతి తీసుకుని వాణిజ్య అవసరాల కోసం భవనాలు నిర్మిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలకు నోటీసులు…
మంత్రాలయంలో హోమ్స్టేలపై కుడా హెచ్చరిక





