భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: కాంగ్రెస్ పార్టీలో కష్టపడే ప్రతి వారికి గౌరవం దక్కుతుందని దానికి నిదర్శనమే జిల్లా అధ్యక్షురాలు ఎన్నిక అని కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం అన్నారు. మంగళవారం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో మహిళలకు అధిక ప్రాధాన్యం కాక , జిల్లా అధ్యక్షురాలిగా దేవి ప్రసన్నను నియమించి నిరూపించామని తెలియజేశారు. దీనికి సహకరించిన పిసిసి అధ్యక్షులకు, ముఖ్యమంత్రికి, జిల్లా మంత్రులకు, పినపాక…