భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు తహశీల్దార్ కార్యాలయం ముందు రైతు సంఘం ఆధ్వర్యంలో సురేష్ అధ్యక్షతన పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. రాష్ట్రంలో పత్తి, ఉల్లి, మొక్కజొన్న పంటలు వర్షాలు, తుఫాన్లతో భారీగా దెబ్బతిన్నాయని రైతు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

పత్తికి రూ. 8110 ధర ఉన్నప్పటికీ, తూకాలు, తేమ శాతం పేరుతో సీసీఐ కొనుగోళ్లను నిలిపివేసిందని మండిపడ్డారు. పత్తిని పూర్తిగా కొనుగోలు చేయాలని, ఉల్లికి రూ. 1200, మొక్కజొన్నకు రూ. 2400 మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు.…