భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రైతులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్‌లో వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. వరి వంటి సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా పప్పుధాన్యాలు, నూనె గింజలు, ముఖ్యంగా ఆయిల్ ఫామ్ సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.

పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా నివారణ చర్యలు చేపట్టాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని…