భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మున్సిపాలిటీలో స్వచ్ఛ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ మరణించాడు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్ హాజరై వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, దహన సంస్కార ఖర్చుల నిమిత్తం రూ.10 వేల చెక్కును అందజేశాడు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇంఛార్జ్ ఉదయ్ కుమార్, వార్డ్ అధికారి రాములు, జవాన్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.