భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: నంద్యాల ప్లంబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న ప్లంబర్‌కు ఆర్థిక సాయం అందజేశారు. నంద్యాల నబీ నగర్ ఆర్చి సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యుడు ఎస్.జలీల్ బాషా అనారోగ్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, అసోసియేషన్ సభ్యులు ఐక్యమత్యంగా కలిసి రూ.33,000 ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు మస్తాన్ ఖాన్తో పాటు కమిటీ సభ్యులు మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా అందరూ ఐక్యంగా ఉండి పరస్పర సహాయ సహకారాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ…