భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట పట్టణంలో 6వవార్డ్ కు చెందిన కోనాపురం రాములు అనే పేద వృద్ధుడు మరణించాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రముఖ సంఘ సేవకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ కార్యకర్త పుట్టి సందీప్ తన తల్లి దివంగత పుట్టి బాలమని జ్ఞాపకార్ధంగా వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించారు. రాములు కుటుంబానికి ఆర్థిక సాయంగా రూ.5 వేలు అందించారు. ఆ యొక్క కుటుంబానికి తాను ఎల్లవేళలా సాయాన్ని చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ పెద్దలు, ఆరో వార్డు…