భార‌త్ స‌మాచార్.నెట్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్: రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రానికి ఫైర్ స్టేషన్ అవసరమని, అందుకు సంబంధించిన డీపీఆర్ తయారు చేసి పంపించాలని మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. గురువారం జడ్చర్ల పట్టణంలో కొత్తగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు ప్రభుత్వం అగ్నిమాపక శాఖకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మండలానికి ఒక ఫైర్ స్టేషన్ ఉంటే ప్రమాదాల తీవ్రత తగ్గుతుందన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నియోజకవర్గ సమస్యలపై…