భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రాఖీ పౌర్ణమి సందర్భంగా మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోతు కవిత అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటిచెప్పారు. నెల్లికుదురు మండలం వావిలాల గ్రామ మాజీ సర్పంచి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొల్లెపల్లి శ్రీనివాస్ గౌడ్‌కు ఆమె రాఖీ కట్టి రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాలోతు కవిత శ్రీనివాస్ గౌడ్‌కు మిఠాయిలు తినిపించి ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగాలకు ప్రతీకగా నిలిచే…





