భార‌త్ స‌మాచార్.నెట్, అనకాపల్లి జిల్లా: చోడవరం నియోజకవర్గం పరిధిలోని చీడికాడ మండలం జైతవరంలో పశువుల ఆరోగ్యం, ఉత్పత్తి సామర్థ్యం పెంపు లక్ష్యంగా ఉచిత పశు గర్భ కోశ చికిత్స శిబిరం విజయవంతంగా నిర్వహించారు. పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, రాష్ట్రీయ గోకుల్ మిషన్ నిధులతో ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కోడూరు సత్యవతి, ఎంపీటీసీ పైలా ముత్యాల నాయుడు ప్రారంభించారు. రైతులకు ఖనిజ లవణ మిశ్రమం, ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ గడ్డి ముచ్చులు ఉచితంగా పంపిణీ చేయడంతో ఈ శిబిరం చోడవరం ప్రాంత రైతులకు…