భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో శనివారం ఎమ్మిగనూరు ఆర్కే హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి పరీక్ష శిబిరం విజయవంతంగా ముగిసింది. కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో డాక్టర్ హేమంత్ కుమార్ ఈ శిబిరాన్ని నిర్వహించారు.
ఈ శిబిరంలో 200 మందికి పైగా ప్రజలు కంటి పరీక్షలు చేయించుకున్నారు. గత 20 ఏళ్లుగా నిరుపేదలకు ఉచిత ఆపరేషన్లు చేసి సేవాభావంతో పనిచేసిన డాక్టర్ హేమంత్ కుమార్‌ను నియోజకవర్గ ఇన్‌చార్జి…





