భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: పాణ్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల భవిష్యత్తుకు ఊతమిచ్చేలా కొత్త సర్టిఫికేట్ కోర్సులు ప్రారంభమయ్యాయి. ఇంఛార్జి ప్రిన్సిపాల్ శోభా రాణి ఆధ్వర్యంలో భాషా నైపుణ్యం, కంప్యూటర్ నైపుణ్యం కోర్సులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నంద్యాల KVSC డిగ్రీ కాలేజీ ఇంగ్లిష్ అధ్యాపకురాలు ఎస్. పార్వతి దేవి, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ ప్రాధాన్యతను వివరించారు. ఈ శిక్షణ 30 రోజులు కొనసాగుతుందని కోర్సుల కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. ఫారిదా తెలిపారు. ఈ కోర్సులు…
ఉచితంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ప్రారంభం



