భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: సమరయోధుల పోరాటం, అమరవీరుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని మహాత్మాగాంధీ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు, సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ జిల్లా కోశాధికారి కక్కిరేణి శ్రీనివాస్ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు వందనం చేసి స్వాతంత్ర్య సమరయోధుల సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా కక్కిరేణి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు, సమరయోధులు తమ జీవితాలను…