భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలోని అల్లూరి సీతారామరాజు కాలేజీ పక్కన పెద్ద మొత్తంలో చెత్త పేరుకుపోయింది. ప్లాస్టిక్ వ్యర్ధాలు, కాగితాలు చెల్లచెదురుగా ఉండటం వల్ల విద్యార్థులు, స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ పక్కన ఇంత చెత్త ఉండడం పిల్లల ఆరోగ్యానికి హానికరమని, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.